
విశాఖపట్నం ఇక నుంచి ఏఐపట్నం: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రధాని మోడీ దార్శనికతలో భాగంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి చాలా తక్కువ సమయంలోనే శంకుస్థాపన జరిగి, రికార్డు సమయంలో పూర్తి చేస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. విశాఖపట్నం ఇక నుంచి ఏఐపట్నంగా మారుతుందని, ప్రపంచ ఐటీ రంగంలో భారత్ లీడర్‌గా, నమ్మకమైన భాగస్వామిగా ఉందని ఆయన పేర్కొన్నారు. గూగుల్ క్లౌడ్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరవుతారని ఆయన వెల్లడించారు.




