
పెళ్లిలో చికెన్ ఫ్రై కోసం దారుణంగా కొట్టుకున్న బంధువులు (వీడియో)
ఉత్తరప్రదేశ్ బిజ్నూర్లో పెళ్లి వేడుక రణరంగంగా మారింది. చికెన్ ఫ్రై తక్కువగా వడ్డించారనే కారణంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరుడి బంధువులు ఫుడ్ సర్వింగ్పై అభ్యంతరం తెలపగా, అమ్మాయి వైపు వారు అదనంగా చికెన్ తెప్పించారు. అయినా సరిగ్గా వడ్డించడం లేదని, చికెన్ ఫ్రై పీసులు తగ్గువగా వేస్తున్నారని మళ్లీ వాదనకు దిగడంతో గొడవ తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 15 మంది గాయపడ్డారు. చివరికి పోలీసుల జోక్యంతో పెళ్లి కార్యక్రమం పూర్తయ్యింది.




