
ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం
అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన యూపీలోని బులంద్‌షహర్ లో వెలుగుచూసింది. ఈ అఘాయిత్యం అనంతరం ఆ చిన్నారిని భవనం టెర్రస్ పైనుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




