జంతు ప్రేమికుని అంతిమ యాత్రలో పాల్గొన్న హనుమంతుడు.. వీడియో వైరల్​

68చూసినవారు
జంతు ప్రేమికుడు అంతిమ యాత్రలో ఒక కొండముచ్చు పాల్గొంది. జార్ఖండ్ రాష్ట్రం దేవఘర్ జిల్లాలోని బ్రాంసోలి గ్రామానికి చెందిన మున్నా సింగ్‌ జంతువులు, కోతులు, కొండ ముచ్చులను చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. వాటికి రొట్టెలు, అన్నం పెట్టేవారు. అతడు చనిపోగా, అతడి మొహాన్ని కొండముచ్చు తీక్షణంగా చూసింది. గంటల తరబడి అక్కడే కూర్చుండిపోయింది. అంతిమ యాత్రలోనూ పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.