
ఆసుపత్రిలో ఆవు సంచారం.. వీడియో తీసిన వ్యక్తిపై కేసు
జమ్మూకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. జిల్లా ఆసుపత్రిలోకి ఓ ఆవు చొరబడి అక్కడే తిరిగింది. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డు అప్పుడే అక్కడి నుంచి వెళ్లాడని, ఇంతలో ఆవు వచ్చిందని చెప్పారు. ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైందని వెల్లడించారు. ఆవుల రాకను ఆపకుండా వీడియో తీసిన వ్యక్తిపై కేసు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.




