
భార్య రావడం లేదని గొంతు కోసుకున్న భర్త
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన నరసింహ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని తీవ్రగాయాలతో గుర్తించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.




