
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. తల్లి ఆత్మహత్య
TG: కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెంది తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఊకల్లు గ్రామానికి చెందిన నార్లపురం జయమ్మ (40) కూతురు శీరిష ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన జయమ్మ ఈ నెల 11న గడ్డి మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయారు.




