ఎమ్మెల్యే సంజయ్ ఇప్పటికైనా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం సంతోషం: జీవన్ రెడ్డి

39చూసినవారు
TG: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనడం సంతోషమని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. సంజయ్ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనడంపై జీవన్ రెడ్డి ఫైరయ్యారు. 'సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాలి. నీ సంసారం చక్క బెట్టుకో.. నా కుటుంబంలో చిచ్చు పెట్టకు' అని హెచ్చరించారు.