అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ పర్యటనలో భాగంగా, ఉప్పల్ మైదానంలో జరిగిన ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్ జట్టు 3-0 గోల్స్‌తో విజయం సాధించింది. ఈ సందర్భంగా మెస్సి, సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ విన్నర్, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందించారు. హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉందని, ఇక్కడి ప్రజలు చూపిన అభిమానం తనకు ఎంతో శక్తినిచ్చిందని మెస్సి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.