వేధింపులు.. విద్యార్థిని మృతి (వీడియో)

34చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌ ధర్మశాలలోని ఓ డిగ్రీ కాలేజీలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాంపస్‌లో ర్యాగింగ్, వేధింపులు వల్ల మనోవేదనకు గురైన 19 ఏళ్ల విద్యార్థిని శారీరక, మానసిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చికిత్స పొందుతూ గత నెల 26న మృతి చెందింది. ఈ మేరకు బాధితురాలి తండ్రి విక్రమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాలలో ప్రొఫెసర్‌ సహా ముగ్గురు విద్యార్థులు యువతిని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్