భారత్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ‘రూమర్డ్’ గర్ల్‌ఫ్రెండ్‌గా మహికా శర్మ పేరు సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశం అయ్యింది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వీరు కెమెరాలకు చిక్కడంతో వారి రిలేషన్‌పై చర్చ ప్రారంభమైంది. గతంలో నటాషాతో విడాకులు తర్వాత హార్దిక్ మహికాతో మొదటిసారి కనిపించడం గమనార్హం. ఐఎఫ్‌ఏ మోడల్ ఆఫ్ ది ఇయర్ అయిన మహికా ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసి, ప్రముఖ బ్రాండ్ల షోల్లో పాల్గొంటుంది.