
హార్ముజ్ జలసంధి తెరవడానికి అమెరికా-ఇరాన్ ఒప్పందం
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ మధ్య త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను త్వరలోనే పునరుద్ధరించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణకు ముగింపు పలికే దిశగా ఇది అతిపెద్ద దౌత్యపరమైన పురోగతిగా భావిస్తున్నారు.




