కవిత ఆరోపణలు.. BRS స్పందనపై ఉత్కంఠ

7722చూసినవారు
కవిత ఆరోపణలు.. BRS స్పందనపై ఉత్కంఠ
BRS నేతలపై కవిత చేసిన ప్రకంపనల ధ్వని ఇంకా రాష్ట్రంలో తగ్గలేదు. కేసీఆర్, KTRపై హరీశ్ రావు, సంతోష్ రావు కుట్రలు చేస్తున్నారని కవిత చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై KCRతో చర్చించేందుకు హరీశ్ రావు ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. BRS ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో BRS అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. కాగా, కవితను BRS సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.