రేపు తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇవ్వనున్న హరీష్ రావు

0చూసినవారు
రేపు తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇవ్వనున్న హరీష్ రావు
TG: రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వివాదం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ (PPT) ఇవ్వనున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో చేసిన అప్పులపై ఆయన లెక్కలు తేల్చనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ ప్రజంటేషన్ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్