TG: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను ఆదివారం మాజీ మంత్రి,
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సందర్శించారు. శనివారం నుంచి రంగనాయక సాగర్‌లోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.