గ్యాస్ స్టవ్ మంట తగ్గిందా? ఇంట్లోనే ఇలా సరిచేయండి!

9464చూసినవారు
గ్యాస్ స్టవ్ మంట తగ్గిందా? ఇంట్లోనే ఇలా సరిచేయండి!
స్టవ్ మంట చిన్నగా వస్తే వంట ఆలస్యమవడమే కాకుండా గ్యాస్ వృథా అవుతుంది. ఈ సమస్యను ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు. ముందుగా గ్యాస్ రెగ్యులేటర్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి. బర్నర్‌లను తీసి, వాటి రంధ్రాలను శుభ్రం చేయాలి. తర్వాత స్టవ్‌ను విడదీసి, నిప్పల్స్‌ను జాగ్రత్తగా తీసి, వాటిలోని సన్నని రంధ్రాలను పిన్నీస్‌తో శుభ్రం చేయాలి. నిప్పల్స్‌ను తిరిగి బిగించి, బర్నర్ బాటమ్‌లను సరిగ్గా అమర్చాలి. పెద్ద బర్నర్ బాటమ్‌ను గ్యాస్ పైప్‌కు దూరంగా, చిన్న బర్నర్ బాటమ్‌ను దగ్గరగా అమర్చాలి. రెగ్యులేటర్‌ను తిరిగి కనెక్ట్ చేసి స్టవ్‌ను పరీక్షించాలి. సిమ్ లో పెట్టినప్పుడు మంట ఆరిపోయే సమస్య ఉంటే, టెక్నీషియన్‌ను సంప్రదించాలి.

ట్యాగ్స్ :