శబరిమలలో బంగారు కిరీటం మాయం?

44చూసినవారు
శబరిమలలో బంగారు కిరీటం మాయం?
శబరిమల బంగారం చోరీ కేసులో అరెస్టులు కొనసాగుతుండగా తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ స్ట్రాంగ్ రూమ్ లోని 55.72 సవర్ల (446 గ్రాములు) బరువున్న బంగారు కిరీటం మాయమైనట్లు సమాచారం. దాని స్థానంలో 240 గ్రాముల బరువున్న నకిలీ కిరీటాన్ని ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఒరిజినల్ కిరీటం సురక్షితంగానే ఉందని ట్రావెన్కోర్ బోర్డు చెబుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్