టాలీవుడ్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వెనుకబడిందా?

17093చూసినవారు
టాలీవుడ్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద వెనుకబడిందా?
గత ఏడాది బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించిన టాలీవుడ్, ఈ ఏడాది మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. కల్కి, పుష్ప2 వంటి చిత్రాలతో రూ. వెయ్యి కోట్లు కొల్లగొట్టి, దేవరతో రూ. 500 కోట్లు దాటిన టీటౌన్, ఈ ఏడాది రూ. 500 కోట్లు కూడా చేరుకోలేకపోయింది. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాలు ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చినా, రీజనల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను బీట్ చేయలేకపోయాయి. మిగిలిన మూడు నెలల్లో అయినా టాలీవుడ్ తన సత్తా చాటుకుంటుందో లేదో వేచి చూడాలి.
Job Suitcase

Jobs near you