ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్
ఇండియా (BOI) గుడ్‌న్యూస్ చెప్పింది. మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి వయోపరిమితి 25 నుంచి 45 ఏళ్ల వరకు ఉండగా, రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది. ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి స్కేల్‌ను బట్టి రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.