ఫ్లోరిడాలోని శాన్ ఆంటోనియోలో మిరాడా నివాస సముదాయంలో 15 ఎకరాల విస్తీర్ణంతో అమెరికాలోనే అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ భారీ పూల్‌లో ఒకేసారి 3,000 మంది ఈత కొట్టవచ్చు. బీచ్‌ను తలపించే వాతావరణంతో పాటు వాటర్ స్లైడ్‌లు, వాలీబాల్ కోర్టులు, చేపలు పట్టే సరస్సు కూడా ఉన్నాయి. మరో వారం రోజుల్లో దీనిని ప్రారంభించనున్నారు. గతంలో ఫ్లోరిడాలోని సెయింట్ జాన్స్‌లో ఉన్న బీచ్‌వాక్ క్లబ్ క్రిస్టల్ లగూన్ 14 ఎకరాలతో అతిపెద్ద పూల్‌గా ఉండేది.