పదేళ్లు అధికారంలో ఉండి సినీ పరిశ్రమను పట్టించుకున్నారా?: ప్రభుత్వ విప్

12చూసినవారు
TG: మాజీమంత్రి హరీష్ రావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. 'సినిమా పరిశ్రమపై హరీష్ రావు చిలక పలుకులు పలుకుతున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి సినీ పరిశ్రమను పట్టించుకోలేదు. కనీసం నంది అవార్డులను ఇవ్వలేదు. మీ హయాంలో సినీ నిర్మాతలకు, హీరోలకు లబ్ది చేకూర్చేందుకు టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చారు. కానీ మా సీఎం రేవంత్ సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రీ రిలీజ్ షోల ఆదాయంలో 20 శాతం ఇచ్చేలా జీవో ఇచ్చారు. సినీ కార్మికులకు ప్రత్యేక విద్య, వైద్య ఏర్పాట్లు చేశారు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్