హర్యానాలోని ఫరీదాబాద్‌లోని సెక్టార్ 24లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక దుండగుడు కంపెనీ బయట పార్క్ చేసిన కారు అద్దాన్ని బద్దలు కొట్టి.. అందులో ఉన్న డబ్బుతో కూడిన బ్యాగ్‌ను దొంగిలించి పరారయ్యారు. ఆ బ్యాగులో దాదాపు రూ.12 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.