ఒక సంవత్సరంలో రూ.2708 కోట్లు విరాళమిచ్చాడు (వీడియో)

9చూసినవారు
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్థాపకుడు శివ్‌ నాడార్‌ కుటుంబం 2025 సంవత్సరానికి సంబంధించిన ‘ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా ఫిలాంత్రఫీ లిస్ట్’ ప్రకారం, దేశంలోనే అత్యధికంగా విరాళాలు ఇచ్చిన కుటుంబంగా నిలిచింది. 2024తో పోల్చితే 26 శాతం పెరుగుదలతో, 2025లో వారు మొత్తం రూ.2,708 కోట్లు దానం చేశారు. అంటే ఆయన కుటుంబం రోజుకు సగటున రూ.7.4 కోట్లు సమాజానికి తిరిగి అందించింది. గత ఐదేళ్లలో నాలుగోసారి శివ్‌ నాడార్‌ దేశంలో అగ్ర దాతగా గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్