ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కారు ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టి బానెట్‌పై అర కిలోమీటరు దూరం అలాగే లాక్కొని పోయింది. డ్రైవరు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 2.30కు జరిగినట్లుగా సీసీటీవీలో రికార్డు అయింది.