పెళ్లంటూ దగ్గరై రూ.40 లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాడు

80చూసినవారు
పెళ్లంటూ దగ్గరై రూ.40 లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాడు
సైబర్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ డీజీపీ బి.శివధర్‌రెడ్డి సూచించారు. మంగళవారం బంజారాహిల్స్‌లో ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’ అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆయన, ఓ యువతి సైబర్ మోసానికి గురైన తీరును వివరించారు. సామాజిక మాధ్యమంలో పరిచయమైన యువకుడు, పెళ్లంటూ దగ్గరై ఆమె పేరుతో లోన్‌యాప్‌ల ద్వారా రూ.40 లక్షలు తీసుకొని ఖర్చు చేశాడని, దీనివల్ల ఆ యువతి 30 ఏళ్లకే అధిక రక్తపోటు, మధుమేహం బారిన పడిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్