రోడ్డుపై అమ్మాయి ఒంటరిగా కనపడితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా మైనర్ బాలికను ఓ వ్యక్తి అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్ నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న బాలిక మీద సైకిల్ పై వచ్చిన వ్యక్తి చేతులు వేస్తూ అసభ్యంగా తాకాడు. బాలిక ప్రతిఘటించడంలో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ ఘటన యూపీలోని మొరాదాబాద్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.