మా ఓటమికి కారణం అతడే: సూర్య కుమార్

79చూసినవారు
మా ఓటమికి కారణం అతడే: సూర్య కుమార్
మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, 'జోష్ హేజిల్‌వుడ్ కారణంగానే ఈ మ్యాచ్ ఓడిపోయాం. అతడు పవర్ ప్లేలోనే 4 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశాడు. అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లంతా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో విఫలమయ్యారు. టాస్ కూడా నిరాశపరిచింది. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఆపై ఫీల్డింగ్‌లో కాపాడుకోవాలి. మేం ఈ రెండూ చేయలేకపోయాం' అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you