AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. నర్సింహులు అనే వ్యక్తి తాంత్రిక వైద్యం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కర్లమడుగు క్రాస్ గ్రామానికి చెందిన నాగరాజుతో నర్సింహులుకు స్నేహం ఉంది. ఈ క్రమంలో నాగరాజు భార్య గంగాదేవితో నర్సింహులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యను తాంత్రిక శక్తులతో వశపరుచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని నర్సింహులును నాగరాజు చంపి పూడ్చివేశాడు. పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.