AP: విజయనగరం (D), బాడంగి (M), గొల్లాది గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. మామిడి సత్యానికి రాము (32) అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు తరచుగా మద్యం తాగుతుండేవాడు. ఈ నెల 1న తండ్రికి ఫించన్ డబ్బులు రాగా, వాటిని కోడలికి ఇచ్చాడు. భర్త ఆ డబ్బులు అడగ్గా.. ఇవ్వనని చెప్పింది. దీంతో రాము భార్యను కొట్టి, తండ్రి గొంతు కోసి, తల వేరు చేసి చంపాడు. అనంతరం ఆ తలను ఒక సిమెంట్ బొచ్చెలో పెట్టి దూరంగా పడేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.