స్నేహితుడిని చంపి.. ఘాటీలో మృతదేహాన్ని పడేశాడు

44చూసినవారు
స్నేహితుడిని చంపి.. ఘాటీలో మృతదేహాన్ని పడేశాడు
AP: కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు (55), రాజేశ్వరరావు స్నేహితులు. వెంకటేశ్వర్లు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. వీరిద్దరూ దసరా రోజున కారులో బయటకు వెళ్లారు. తుని-నర్సీపట్నం మార్గంలో డబ్బుల పంపకాల విషయంలో మనస్పర్థలు రావడంతో గొడవపడ్డారు. కోపంతో వెంకటేశ్వర్లును రాజేశ్వరరావు కొట్టి చంపి మృతదేహాన్ని అల్లూరి జిల్లా బొంతువలస ఘాటీలో పడేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడగా.. రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్