భార్యను చంపి బైకుపై తీసుకెళ్లాడు

59చూసినవారు
భార్యను చంపి బైకుపై తీసుకెళ్లాడు
పల్నాడు జిల్లాలో రొంపిచర్ల మండలం మాచవరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త వెంకటేశ్వర్లు హత్య చేశాడు. పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి తరచుగా గొడవలు జరుగుతుండడంతో భార్యభర్తల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో భార్య వద్దకు వెళ్లిన వెంకటేశ్వర్లు, ఆమెను రొంపిచర్లకు తీసుకెళ్లి గొడవపడి, దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బైకుపై ఎక్కించుకొని PSలో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్