ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 18 నెలల పసికందును ఓ వ్యక్తి.. పదేపదే నేలకేసి కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. ఫిరోజాబాద్‌కు చెందిన రతిదేవి(40), సుమిత్ దంపతులు. వీరికి మనస్పర్థలు రావడంతో తన కొడుకు ఆరవ్‌తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో రతిదేవికి విరాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పెళ్లికి రతిదేవి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని, ఆరవ్‌ను బయటకు తీసుకెళ్లి నేలకేసి కొట్టి చంపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.