AP: ఈ నెల 3న (శుక్రవారం) కాకినాడలో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నరేందర్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా కాంక్రీట్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టాడు. ఈ క్రమంలో లారీ ముందు టైర్ల మధ్యలో పడిపోయాడు. చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతని అదృష్టం వల్ల గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.