నామినేషన్ పత్రాలు చింపి తినేశాడు

18105చూసినవారు
నామినేషన్ పత్రాలు చింపి తినేశాడు
మహారాష్ట్రలోని పుణెలో ధంకవాడి సహకర్‌నగర్‌ వార్డు కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. శివసేన పార్టీకి చెందిన అభ్యర్థి ఉద్ధవ్‌ కాంబ్లీ, తన ప్రత్యర్థి మచ్చీంద్ర ధవాలేకు చెందిన ఏ, బీ ఫారాలను లాక్కొని చింపి తినేశాడు. ఈనెల 15న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ధవాలే ఫిర్యాదు మేరకు కాంబ్లీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్