మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. పబ్లిక్‌గా ఆమెకు ముద్దు పెట్టబోయాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక ప్రజలను కలిసి క్లాడియా మాట్లాడుతుండగా వెనుకనుంచి వచ్చిన ఓ యువకుడు ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యంగా తాకాడు. అంతటితో ఆగకుండా ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో సెక్యూరిటీ వెంటనే అతడిని వెనక్కి నెట్టి నిలువరించింది.