కోయంబత్తూరులో 250 కిలోలకు పైగా గుట్కాతో పారిపోతున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ సాహసోపేతమైన విన్యాసం చేశారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి, కానిస్టేబుల్ వేల్మురుగన్ ఎస్‌యూవీ రూఫ్ రైల్స్‌ను పట్టుకుని సుమారు 40 కిలోమీటర్ల మేర వాహనంపై వేలాడుతూ ప్రయాణించారు. ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) అంబులెన్స్ సిబ్బంది ఈ భయానక దృశ్యాలను వీడియో తీయడంతో కానిస్టేబుల్ చూపించిన తెగువ వెలుగులోకి వచ్చింది.