
జగన్ రోడ్ షోకు నో పర్మిషన్
AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకూ 63 కిమీ రోడ్‌షో చేయడానికి అనుమతిని నిరాకరించినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ట్రాఫిక్, ప్రజా అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు మార్గంలో కాన్వాయ్ అనుమతి లేదని అన్నారు. అయితే మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి జగన్ హెలికాప్టర్ ద్వారా మాత్రమే రావచ్చని అన్నారు.




