శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య రక్షణలో అల్లం, పసుపు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిలో అల్లం, పసుపు కలిపి తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్లం, పసుపు కలిపిన నీళ్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, గొంతు నొప్పి నివారణతో పాటు బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది.