ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ప్రియురాలితో పాటు స్నేహితురాలిని చంపిన రష్యా వ్యక్తి
Jan 17, 2026, 11:01 IST/

ప్రియురాలితో పాటు స్నేహితురాలిని చంపిన రష్యా వ్యక్తి

Jan 17, 2026, 11:01 IST
గోవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలుతో పాటు స్నేహితురాలిని ఓ రష్యా వ్యక్తి దారుణంగా చంపాడు. రష్యా జాతీయుడైన అలెక్సీ లియోనోవ్‌(37), జనవరి 14న మోర్జిమ్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్న స్నేహితురాలు ఎలెనా వనీవా(37)ను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అరమ్బోల్ గ్రామానికి అలెక్సీ చేరుకున్నాడు. జనవరి 15న తనతో కలిసి ఉంటున్న ప్రియురాలు ఎలెనా కస్థానోవానతో అతడు గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి గదిలో బంధించాడు. అయితే ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా కత్తితో గొంతు కోసి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.