
శాస్త్రవేత్తలను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారు: ఎంపీ మాణికం ఠాగూర్
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇస్రో విజయాలను తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రం.. శాస్త్రవేత్తల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను విస్మరిస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రయోగాల విజయాల సమయంలో కెమెరాలకు ఫోజులిస్తూ, శాస్త్రవేత్తల హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మౌనంగా ఉంటున్నారని ఆదివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆరు దశాబ్దాల ఇస్రో ప్రభుత్వ రంగ స్వరూపాన్ని, శాస్త్రవేత్తల త్యాగాలను నిర్వీర్యం చేయవద్దని ఆయన హెచ్చరించారు.




