TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి కస్టడీ పిటిషన్‌పై విచారణ జరిగింది. రవిని మరిన్ని రోజులు కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. కస్టడీ పేరుతో రవిని అనవసరంగా వేధిస్తున్నారని రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ పేర్కొన్నారు. రవిని కస్టడీకి తీసుకుంటేనే అతని నెట్‌వర్క్ బయటపడుతుందంటూ సైబర్ క్రైమ్ అడ్వకేట్ వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 16కు తీర్పును రిజర్వ్ చేశారు.