TG: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తనపై హైకోర్టు వేసిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై దానం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపకపోతే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందన్నారు. రేపే విచారణ జరపాలని కోరగా, తమ వాదన పరిగణనలోకి తీసుకోవాలని ప్రతివాదులు కోరారు. దీంతో బుధవారం ఈ కేసు విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.