తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజుల వసూళ్ల వివాదంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ కేసులో తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు, స్టే ఆదేశాలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయొద్దని, నేరుగా విద్యార్థుల అకౌంట్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేసి కాలేజీలకు చెల్లించాలని జారీ చేసిన జీవో నంబర్-9 లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు గతంలోనే తాత్కాలిక స్టే విధించింది.