నేడు iBOMMA రవి బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ

29చూసినవారు
నేడు iBOMMA రవి బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ
TG: పైర‌సీ సినిమాల కేసులో iBOMMA ర‌విని అరెస్ట్ చేసిన పోలీసులు.. క‌స్ట‌డీ విచార‌ణ‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. 8 రోజుల విచార‌ణ‌లో ఐబొమ్మ‌కు సంబంధించి ప‌లు కీల‌క ఆధారాల‌ను సైబ‌ర్ క్రైమ్ పోలీసులు రాబ‌ట్టారు. కాగా ఇవాళ మ‌రో మూడు కేసుల్లో ర‌విని పోలీసులు కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. ర‌విని మళ్లీ క‌స్ట‌డీకి తీసుకుని విచారించాల‌ని పోలీసులు భావిస్తున్నారు. మ‌రోవైపు ఇవాళ ర‌వి బెయిల్ పిటిష‌న్ పైనా విచార‌ణ జ‌ర‌గ‌నుంది. దీంతో ర‌వికి బెయిల్ మంజూరు అవుతుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్