గుండె జబ్బులు చిన్న వయసులోనే వస్తున్న నేపథ్యంలో ముందస్తు
పరీక్షలు కీలకం. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ వంటి ప్రమాద కారకాలు లక్షణాలు లేకుండానే పెరగవచ్చు. 20 ఏళ్లు దాటినవారు 2–3 ఏళ్లకోసారి బీపీ, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్
పరీక్షలు చేయించుకోవాలి. 35 ఏళ్లు పైబడినవారు లేదా అధిక రిస్క్ ఉన్నవారు వైద్యుల సూచనతో ECG, 2D ఎకో, TMT వంటి
పరీక్షలు చేయించుకోవాలి. రోజూ 30 నిమిషాల నడక, సమతుల్య ఆహారం, తగిన నిద్ర, ధూమపానానికి దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.