AP: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాయలసీమ జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు రాత్రి నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.