ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రెడ్ అలర్ట్ జారీ చేశాయి. భారీ వర్షాలతో పాటు ఎత్తైన ప్రాంతాల్లో మంచు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేదార్నాథ్ హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేశారు. వాతావరణం పూర్తిగా మెరుగుపడిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.