భారీ వర్ష సూచన.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ

96చూసినవారు
భారీ వర్ష సూచన.. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో 21 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి పూరీ తీరానికి సమీపంలో కేంద్రీకృతమై వాయవ్య దిశగా కదులుతోంది.

సంబంధిత పోస్ట్