TG: హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో వర్షం ప్రభావం చూపింది. గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా ఇప్పటికే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, మళ్ళీ కురిసిన ఈ వర్షం వాహనదారులకు ఇబ్బందులు సృష్టించింది. నగరంలో జనజీవనం స్తంభించింది.