ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీవర్షం

5చూసినవారు
ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీవర్షం
TG: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి, రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చింతకాని మండలంలో కురిసిన భారీ వర్షానికి రైతు మేళా, సీఎం సభ జరగాల్సిన ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతు మేళా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఈదురు గాలులకు కుప్పకూలాయి. మరోవైపు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లి, ఎడపల్లి, ఆర్మూర్‌, భిక్కనూర్‌ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్